ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 1:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కాక్రోచ్ పార్టీకి దీపావళి సెలవులు.

కాక్రోచ్ పార్టీకి దీపావళి సెలవులు.

న్యూఢిల్లీ, అక్టోబరు 22, (అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 22.)

కాక్రోచ్ జనతా పార్టీ లీడర్లు దీపావళి వరకూ సెలవులు ప్రకటించుకున్నారు. అప్పటి వరకూ ఎలాంటి ఆందోళనలు చేయబోమని దీప్కే ప్రకటించారు. ఈ ప్రకటనలకు కారణం వారి అంతర్గత నిస్సహాయతే ప్రధాన కారణమని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. పార్టీ కీలక నాయకులు దాస్, రాంకా లాంటి వారు ఊహించని విధంగా జైలుపాలు కావడంతో కేడర్‌లో నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింది. అగ్రనేతల వెంటే ఉండి నడిపించాల్సిన ముఖ్యులే కటకటాల వెనక్కి వెళ్లేసరికి, రోడ్డెక్కి వారి కోసం పోరాడే దిక్కులేక శ్రేణులంతా ఎవరికి వారు సర్దుకుపోయి సైలెంట్ అయ్యారు.ఈ సంక్షోభ సమయంలో పార్టీకి అండగా నిలవాల్సిన ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు సైతం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ సైతం వివాదాలకు దూరంగా ఒక వీడియోను విడుదల చేసి, తన వ్యక్తిగత పనుల్లో తాను బిజీ అయిపోయారే తప్ప పార్టీ కోసం క్షేత్రస్థాయిలో గళం విప్పే సాహసం చేయడం లేదు. పండుగ తర్వాత కూడా ఈ కాక్రోచ్‌లను సీరియస్‌గా పట్టించుకునే నాథుడే ఉండరు. ఒకప్పుడు హడావుడి చేసిన ఈ వర్గాన్ని, దేశంలోని జెన్-జీ యువత ఎప్పుడో పక్కనబెట్టి విడాకులు ఇచ్చేసింది. మారుతున్న ట్రెండ్స్, యువత ఆలోచనా విధానానికి తగినట్లుగా మారలేకపోవడంతో ఆ పార్టీ పూర్తిగా ఐసోలేట్ అయిపోయింది.కాక్రోచ్ జనతా పార్టీ ర్గాలన్నీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అనుబంధ సభ్యులుగా, సానుభూతిపరులుగా మారిపోయారనేది పరిశీలకుల మాట. తాత్కాలిక హంగామాతో సోషల్ మీడియాలో ట్రెండ్ కావచ్చెేమో కానీ, గ్రౌండ్ రియాలిటీలో నిలకడ లేని ఇలాంటి రాజకీయ ప్రయోగాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని మరోసారి రుజువవుతోంది.నాయకుల అరెస్టులు, మద్దతుదారుల వెనుకంజతో కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దీపావళి తర్వాత హడావుడి చేద్దామనుకున్న ఆ పార్టీ వ్యూహాలు ఇక పారకపోవచ్చు. ప్రభుత్వం వీరిపై వ్యతిరేకత పెంచడమే కాదు.. ఇదే అదనుగా కఠినంగా వ్యవహరించనుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని వీరి వద్ద బాండ్లు తీసుకుని దాన్నే వారి చేతులు కట్టేయడానికి అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు.
మీరు జెన్ జీనా…
కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు సంబంధించిన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ధర్మాసనం వారి వయస్సును తెలుసుకున్న తర్వాత ఆ ఇద్దరు నాయకులు ‘జెన్ జీ’ కిందకు రారని వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా.. పిటిషనర్ల తరఫున హాజరైన లాయర్ అభీక్ చిమ్నీని ఆ ఇద్దరు నాయకుల వయస్సు ఎంత అని జస్టిస్ ప్రసాద్ ప్రశ్నించారు. దాస్‌కి 27 ఏళ్లు, రంకాకి 32 ఏళ్లు అని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ‘‘అలాగైతే మీరు జెన్ జీ కాదు. ఇంతకీ జెన్ జీ అంటే ఏమిటి?’’ అని కోర్టు ప్రశ్నించింది.సాధారణంగా 1997 తర్వాత జన్మించిన వారిని ‘జెన్ జీ ‘ అని పిలుస్తారని తెలియజేయగా.. ‘అలాంటప్పుడు మీరు జెన్ జీ కారనేది స్పష్టం’ అని కోర్టు పునరుద్ఘాటించింది. పిటిషనర్ల జుడీషియల్ కస్టడీని అక్టోబర్ 21 వరకు పొడిగిస్తూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ సంభాషణ సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ ఫోటోను సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కే పోస్ట్ చేస్తూ.. ‘‘జెన్ జీ అర్హత ఉన్న ఏకైక వ్యక్తి ఈయనే’’ అని రాసుకొచ్చారు.మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సవాలు చేయడానికి ‘రివిజన్’ అనే ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉన్నప్పుడు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని కోర్టు ప్రశ్నించింది. ‘‘ఇది మీ రెండో సంఘటన.. మీరు గతంలో పూచీకత్తు  నిబంధనలను ఉల్లంఘించారు. మీ అసలు పరిష్కారం రివిజన్ పిటిషన్‌లోనే ఉంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.శాంతి భద్రతల నిబంధనలను రెండోసారి ఉల్లంఘించినప్పుడు కఠినమైన షరతులను విధించే హక్కు అధికారులకు ఉంటుందా లేదా అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. జంతర్ మంతర్‌ను ధర్నా చౌక్‌గా తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఆ నోటిఫికేషన్‌పై ఎలాంటి స్టే లేదని కోర్టు గుర్తుచేసింది. అటువంటి పరిస్థితుల్లో పిటిషనర్లు మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లడంపై సందేహం వ్యక్తం చేసింది.